న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు

0
164
వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి రౌతు హామీ – 45వ డివిజన్‌లో ఇంటింటికి ప్రచారం
రాజమహేంద్రవరం, మార్చి 25 :  న్యాయవాదుల సంక్షేమానికి తమ పార్టీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు, ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌ తెలిపారు. ఈరోజు బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో కోర్టు ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డు, గుమస్తాలకు ప్రోత్సాహకాలు తమ పార్టీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మామీలు అమలు చేయని విషయం న్యాయవాదులు గమనించాలని, తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసారు. సమావేశంలో ఆ పార్టీ లీగల్‌సెల్‌ నేతలు, న్యాయవాదులు మారిశెట్టి వెంకటేశ్వరరావు, సోమి శ్రీనివాస్‌, సయ్యద్‌ హసన్‌, శంభుప్రసాద్‌, చిట్టూరి వాసు, సయ్యద్‌ హసీనా, ఆరిఫ్‌, మల్లీశ్వరి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
45వ డివిజన్‌లో ప్రచారం : వైఎస్‌ఆర్‌ సిపి ప్రభుత్వంలో అర్హత ఆధారంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రౌతు సూర్యప్రకాశరావు, మార్గాని భరత్‌లు పేర్కొన్నారు. సోమవారం వారు 45వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల్లోని 45 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఏడాదికి రూ 18 వేల 750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ 75 వేలు ఆర్థిక సాయం అందించేలా వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేలా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు కస్సే రాజేష్‌, ముఖ్య నేతలు అజ్జరపు వాసు, పడాల శ్రీను, తలసెట్ల నాగరాజు, గుడాల జాన్సన్‌, గుడాల ప్రసాద్‌, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here