పండగలా ఎన్నికలు  

0
205
23న కళాకేంద్రంలో సంబరాలు : ఆర్‌.ఓ-సాయి కాంత్‌
రాజమహేంద్రవరం,మార్చి 22 : మనం చాలా పండుగలను సంప్రదాయంగా నిర్వహించుకుంటామని అయితే ఐదేళ్ల కోసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలను కూడా  ఒక పండగా నిర్వహించుకుందామని రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌, రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి సి.ఎమ్‌.సాయి కాంత్‌ వర్మ అన్నారు.స్ధానిక  ఆర్‌ అండ్‌ బి  అతిధి గహంలో  ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వ ఆనం కళాకేంద్రంలో 23 వ తేదీ శనివారం సాయంత్రం 5 గం”నుండి 8 గం”వరకు ఎన్నికల సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సంబరాలలో ఓటర్లుకు ఓటు హక్కు గురించి  సాంస్కతిక కార్యక్రమాల ద్వారా తెలియపరుస్తామని తెలిపారు. కూచిపూడి,భరతనాట్యం,పాటలు,సంగీత విభావరి, స్కిట్స్‌ వంటి వాటి ద్వారా ఓటు గురించి చైతన్య పరుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ  కార్యక్రమానికి హాజరుఅయ్యే వారు సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు. కళాకేంద్రం బయట సంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హాజరై, ఓటర్లునుద్దేశించి మాట్లాడతారని ఆర్‌ ఓ  తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయిని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించకుండా  అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగదు లావాదేవీలు లక్షల్లో లేకుండా చూసుకోవాలని,డిజిటల్‌ లావాదేవీలను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ నగదు తీసుకు వెళ్తూ పట్టుబడితే, అలాంటి కేసులను ఈరోజుకు ఆరోజే పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్‌ ఓ సాయి కాంత్‌ వర్మ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here