పతివాడ రమేష్‌బాబుకు మాతృ వియోగం

0
137
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టీచర్స్‌ సెల్‌ ఛైర్మన్‌ పతివాడ రమేష్‌బాబుకి మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి పతివాడ మంచితనం శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు  రమేష్‌బాబు ఐఎస్‌టిఎస్‌ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంబిఎ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వైసిపి టీచర్స్‌ సెల్‌ ఛైర్మన్‌గా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు ఇంజనీర్‌గా, మూడవ కుమారుడు ఎంఎస్‌ సర్జన్‌గా వైద్య వృత్తిలో ఉన్నారు. మంచితనం గారి భూస్థాపన కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్ధానిక సిమెంట్రి పేట క్రైస్తవ స్మశాన వాటికలో జరుగుతుంది. మంచితనం మరణ వార్త తెలియగానే మాజీ శాసన సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, వైసిపి నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, నాయకులు నక్కా శ్రీనగేష్‌, అజ్జరపు వాసు, గారా చంటిబాబు, బొచ్చా రమణ, గుడాల ప్రసాద్‌, తిరగాటి దుర్గా, సోడదాసి సుందర్సింగ్‌, డాక్టర్‌ రాజశేఖర్‌, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు తాళ్ళూరి రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, పి.ఆనందకుమార్‌, సమ్మతం గన్నెయ్య తదితరులు రామదాసుపేటలోని వారి స్వగృహానికి చేరుకొని మంచితనం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంచితనం మృతికి సంతాపం తెలియజేశారు. రమేష్‌బాబు కుటుంబసభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలియజేశారు. వైసిపి సిటీ కో-ఆర్డినేటర్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం ఫోన్‌ ద్వారా పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here