పథకాలను సద్వినియోగపరుచుకోండి

0
284

కాపు కార్పొరేషన్‌ ద్వారా 30 మందికి రుణాలు పంపిణీ

రాజమహేంద్రవరం, జనవరి 19 : రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తూ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా బలపడాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు ఆధ్వర్యంలో శ్యామలా ధియేటర్‌ ఎదురుగా ఉన్న జిల్లా సహకార బ్యాంకులో 30 మంది కాపు సామాజిక వర్గీయులకు స్వయం ఉపాధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఒకవైపు ప్రజల ంక్షేమం మరోవైపు రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రోజూ 18 గంటలకు పైగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషికి ప్రజలు అండగా నిలవాలన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలంలో తిరిగి చెల్లించాలని, తీసుకున్న రుణాలతో వ్యాపారాలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తున్నారని తెలిపారు. యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ఎం.ఎస్‌.ఎం.ఇ. పథకంలో 180 మంది దరఖాస్తు చేసుకోగా 130 మందిని ఎంపిక చేశామని, వారిలో 35 మందికి గ్రౌండింగ్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఒక్కొక్కరికి రూ.10లక్షల సబ్సిడీ చొప్పున రూ.3కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందన్నారు. విదేశీ విద్యకు జిల్లాలో వందమందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10లక్షలు అందిస్తామని, ఫేజ్‌-1 క్రింద రూ.5లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 640 మంది మహిళలకు కుట్టు శిక్షణకు ఎంపిక చేసి శిక్షణ పూర్తయిన తరువాత మిషన్లు అందించామన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణకు జిల్లా నుంచి 25 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.2.60లక్షలు చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, కార్పొరేటర్‌ గాదిరెడ్డి బాబులు, జెడ్‌ఆర్‌యుసిసి సభ్యులు మజ్జి రాంబాబు, టిడిపి నాయకులు మళ్ళ వెంకట్రాజు, మరుకుర్తి రవియాదవ్‌, రొంపిచర్ల ఆంథోని, మానే దొరబాబు, పిన్నింటి రవిశంకర్‌, గరగ మురళీకృష్ణ, గుణపర్తి శివ, శనివాడ అర్జున్‌, బుడ్డిగ రాధ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here