పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి మిత్ర

0
94
ఇంటిగ్రేటేడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.వినయ్‌ కుమార్‌
రాజమహేంద్రవరం, జూలై 9 : వేస్టు పేపర్‌ను సేకరించి దానిని తిరిగి కొత్తపేపర్‌ గా తయారు చేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఇంటిగ్రేటేడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.వినయ్‌ కుమార్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. విశ్వవిద్యాలయంలో కేంద్ర పరిపాలన విభాగం ఆవరణంలో మొక్కలను నాటి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ”ప్రకృతి మిత్ర” అనే పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. దీని ద్వారా వేస్టు పేపర్‌ ను సేకరించి, దానిని ఉపయోగించి కొత్త పేపర్‌ను తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తామని చెప్పారు. వేస్టు పేపర్‌ను ఇలా రిసైకిల్‌ చేయడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఒక టన్ను వేస్టు పేపర్‌ ను తయారు చేయడానికి 15 చెట్లు నరకాల్సి వస్తుందని మరియు ఎంతో నీరు, ఆయిల్‌ వృధా అవుతుందని ఇవన్ని పర్యావరణానికి ఆటంకాలేనని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మనం వేసిన మొక్కలు మన అవసరాల కోసం మనమే నరికేయడం మంచిది కాదని అన్నారు. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని వేస్టు పేపర్‌ ను సేకరించి వర్సిటికి అందించాలని వర్సిటీ ద్వారా మేము తీసుకుంటామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని వాటి పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహిస్తామని అన్నారు. మినిస్టరీ ఆఫ్‌ ఎన్వరాల్మెంట్‌ ద్వారా ఒక్కోక్క విశ్వవిద్యాలయంలో ఒక్కోక్క నర్సరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ”ప్రకృతి మిత్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కొత్తగా నియామకం అవుతున్న గ్రామ వాలంటరీలకు ఈ మొక్కల పరిరక్షణ బాధ్యత అప్పగిస్తామని అన్నారు. వారితో పాటు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల ఎన్‌.ఎస్‌.ఎస్‌ విభాగం వారు వీటిని పర్యావేక్షిస్తారని చెప్పారు. 2024 వరకు ”ప్రకృతి మిత్ర” కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. తరువాత రెక్టార్‌ ఆచార్య పి.సురేష్‌ వర్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ముందంజలో ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాన్ని ప్రకృతిఒడిగా తీర్చి దిద్దాలనే ధృఢ సంకల్పంతో ఎప్పుడూ పని చేస్తూ ఉంటామని చెప్పారు. అలాగే రిజిష్ట్రార్‌ ఆచార్య ఎస్‌.టేకి మాట్లాడుతూ భవితరాల మనుగడకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. అభివ ద్ధి పేరుతో పర్యావరణానికి నష్టం కలిగించకూడాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.ఎస్‌.ఎస్‌ ప్రోగ్రామ్‌ కో.ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.కెజియారాణి, ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ బాలకృష్ణ, డాక్టర్‌ వి.మల్లిప్రియ, డాక్టర్‌ యు.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, డాక్టర్‌ ఎ.శ్రీపద్మవల్లి, జె.రాజమణి, డా.రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here