పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందడుగు

0
191
రాజమహేంద్రవరం, ఆగస్టు 31 : సేవా కార్యక్రమాలే లక్ష్యంగా, ప్రజా చైతన్యమే ధ్యేయంగా ఏర్పడిన పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏడో వార్షికోత్సవం స్థానిక సుబ్రహ్మణ్యమైదానంలో ఈరోజు ఘనంగా జరిగింది. తొలుతగా జరిగిన సభకు సీనియర్‌ పాత్రికేయులు కృష్ణకుమార్‌ సభ నిర్వాహకులుగా వ్యవహరించగా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, సిసిసి ఎండి పంతం కొండలరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా పంతం కొండలరావు అధ్యక్షోపన్యాసం చేసి ఏడేళ్ళలో చేసిన కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. త్వరలో పర్యావరణ పరిరక్షణ కోసం ఒక పక్కా ప్రణాళికతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కొండలరావు ప్రకటించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా వెయ్యికిపైగా అసోసియేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ ద్వారా రాజమహేంద్రవరంలో మొక్కలు నాటించడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకునే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ను వాడకాన్ని నివారించేందుకు అందరూ దృష్టి సారించాలని సూచించారు. మూగజీవాలను కాపాడేందుకు నీటి వసతిని కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా అమలు అవుతుందని, అలాగే ట్రస్ట్‌ ద్వారా 40 విద్యార్థులను చదివించడంతో ప్రారంభించామని, ప్రస్తుతం ఆ సంఖ్య 170కి చేరిందన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందించాలన్నా లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాలను సక్రమంగా అందరికీ అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైకాపా కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, ఆర్యాపురం బ్యాంకు మాజీ ఛైర్మన్‌ చల్లా శంకర్రావు, నగర ప్రముఖులు పట్టపగలు వెంకట్రావు, తదితరులు మాట్లాడారు. ఏదైనా సంస్థను స్థాపించడం కష్టం కాదని, అయితే దానిని నిరంతరం నడిపించడం ఎంతో కష్టమని అన్నారు. అటువంటిది ఎంతో ఉన్నత లక్ష్యంతో స్థాపించిన పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఆ లక్ష్యానికి అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలను అమలు చేయడంలో పంతం కొండలరావు చూపిస్తున్న శ్రద్ధ, పట్టుదల ఆదర్శనీయమని అన్నారు.రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా మాట్లాడుతూ స్నేహానికి గొప్ప విలువనిచ్చే వారిలో పంతం కొండలరావు అగ్రభాగాన ఉంటారన్నారు. తమ కుటుంబం నేడు ఈ స్థాయిలో ఉందంటే  దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు ఇచ్చిన వేదిక మాత్రమేనని అన్నారు. ఆయనతో కలిసి ముందుకుసాగిన వారంతా తమ కుటుంబానికి అండగా నిలిచారని, కష్టాల్లో ఉన్న, సంతోషంలో ఉన్నా వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. నగరంలో కాపుల కళ్యాణ మండపం నిర్మించాలని ఒక చిరకాలవాంఛగా ఉందని, ఆ చిరకాల వాంఛను త్వరలోనే పూర్తి చేస్తానని, ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రభుత్వ నిధులతో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మిస్తానని జక్కంపూడి రాజా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నగరంలో సుమారు మూడు లక్షలకుపైగా రోగులకు ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్‌ పంతం అచ్చుత రామారావు, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజాలను ఘనంగా సత్కరించారు. అనంతరం సుబ్రహ్మణ్య మైదానంలో ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం నగర ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జాగృతి యాత్రను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. అంతకు ముందు పేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రిపోర్టర్‌ తాతాజీ కుటుంబానికి రూ.10 వేల చెక్కును అందజేశారు.  అనంతరం నగరంలోని పలు కూడళ్ల మీదుగా జాగృతి యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు భైర్రాజు ప్రసాదరాజు, నందెపు శ్రీనివాసు,మంతెన కేశవరాజు, తోట సుబ్బారావు, అశోక్‌కుమార్‌ జైన్‌, పొలసానపల్లి హనుమంతరావు, బర్రే కొండబాబు, మేడపాటి షర్మిలారెడ్డి,   టికె విశ్వేశ్వర రెడ్డి, ఎస్‌ఎన్‌ రాజా, ప్రసాదుల హరినాథ్‌, కొల్లేపల్లి శేషయ్య, అరిపిరాల నారాయణరావు, కరీంఖాన్‌, అయ్యల గోపి, అడపా వెంకటరమణ, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, ఇసుకపల్లి శ్రీనివాస్‌, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం,అజ్జరపు వాసు,జక్కంపూడి గణేష్‌, కోళ్ళ బాబు,యెనుముల రంగబాబు, మంచాల బాబ్జీ, వేమన నాగభూషణం, మార్తి నాగేశ్వర్రావు, మజ్జి అప్పారావు, కనకాల రాజా, పోలాకి పరమేష్‌, ముళ్ళ మాధవ్‌, పిల్లి నిర్మల,మానే దొరబాబు, జామిశెట్టి గాంధీ, కేబుల్‌ రమణ, చవ్వాకుల రంగనాధ్‌, చవ్వాకుల సుబ్రహ్మణ్యం,లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఎన్‌.ఎన్‌.ఎస్‌.చంద్రశేఖర్‌, నందం కుమార్‌ రాజా,మహ్మద్‌ ఆరిఫ్‌, పసలపూడి శ్రీనివాస్‌,చోడిశెట్టి సత్యవాణి, అడపా అనిల్‌, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి,ఉదయ్‌ రానా, పెంకే సురేష్‌,కొత్తపల్లి వీరభద్రరావు. యజ్జవరపు మరిడయ్య, నండూరి సుబ్బారావు, కురుమిల్లి స్వరూప్‌, బొరుసు శ్రీనివాస్‌, కోడికోట సత్తిబాబు,డాల్ఫిన్‌ నాగు, ఉప్పాడ కోటరెడ్డి, టివిఎస్‌ నాయుడు, ట్రస్ట్‌ నిర్వాహకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here