పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

0
380
రాజమహేంద్రవరం, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వనం-మనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులై పర్యావరణ పరిరక్షణలో బాధ్యత వహించాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 42వ డివిజన్‌లో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్ని కృష్ణతోపాటు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌, స్థానిక కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి, కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ పాల్గొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన వనం-మనం అందరి కోసమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాసరావు, మళ్ళ వెంకట్రాజు, మొల్లి చిన్నియాదవ్‌, ఎం.ఏ.రషీద్‌, వానపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here