పలు డివిజన్లలో ఎమ్మెల్యే భవానీ పర్యటన

0
133
రాజమహేంద్రవరం, ఆగస్టు 20 : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నగరంలోని పలు డివిజన్లలో మంగళవారం పర్యటించారు. స్థానిక 38వ డివిజన్‌లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని, నగర పాలక సంస్థ కుళాయిల నుంచి నీరు సరిపడినంతగా సరఫరా చేయడం లేదని, అలాగే పాడైన పైపులైన్లకు మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేయడం వల్ల మంచినీరు వృధాగా పోతోందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 40వ డివిజన్‌లో స్థానికంగా ఉన్న టింబర్‌ మర్చంట్లు వ్యర్ధాలు, చెక్కలను రోడ్లపైనే వేయడం వల్ల విష కీటకాలు వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించి ఆయా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ  సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను సత్వరం పరిష్కరించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మాజీ కార్పొరేటర్‌ సింహా నాగమణి, నాయకులు అరిగెళ్ల బాబు, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ తదితరులు వారి వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here