పసుపు-కుంకుమలో చేతివాటాన్ని ప్రదర్శిస్తే సహించేదీ లేదు

0
158
గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ హెచ్చరిక
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పసుపు-కుంకుమ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే కొంతమంది మహిళా నాయకురాళ్ళు ఒకరిద్దరి అధికారుల సహాయంతో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తన ద ష్టికి వచ్చిందని, ఇలాంటి విషయాల్లో ఎవరి హస్తం ఉన్నా   ఉపేక్షించేది లేదని గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ హెచ్చరించారు. ఈ పధకాన్ని అర్హులైన వారికి అందించాల్సిన బాధ్యత ఉందని, ఆ విషయంలో లబ్దిదారుల నుంచి కొంతమంది డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న సమాచారం వచ్చిందని, ఇలాంటి విషయాల్లో అధికారులు సహకరించడంపై గన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని,ఈ విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌ ద ష్టికి తీసుకు వెళ్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here