పాత నోట్లు పన్నులకు పనికొస్తాయి

0
312
నేటి అర్ధరాత్రి వరకు అవకాశం – ఐదేళ్ళ అడ్వాన్స్‌ టాక్స్‌ కట్టొచ్చు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 11 : రద్దయిన రూ.500, రూ. వెయ్యి నోట్లతో మున్సిపల్‌ పన్నులు, ఇతర రుసుములు ఈ రోజు అర్ధరాత్రి వరకు చెల్లించవచ్చని నగరపాలక సంస్ధ అదనపు కమిషనర్‌ జి శ్రీనివాసరావు, సహాయ కమిసనర్‌ ఎంవిడి ఫణిరామ్‌లు వెల్లడించారు. నగరపాలక సంస్ధ కమిషనర్‌ సమావేశపు హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు కార్పొరేషన్‌లోని కౌంటర్‌లలో పన్నులు కట్టించుకోవడం జరుగుతుందన్నారు. పాత బకాయిలతో పాటు 5ఏళ్ళ అడ్వాన్స్‌ పన్నును కూడా కట్టించుకుంటామని తెలిపారు. ఈ సేవా కేంద్రాలలో కూడా పన్నులు, ఇతర బిల్లులో కట్టించుకోవడం జరుగుతుందన్నారు. పన్ను చెల్లింపుదారుల సహాయార్ధం అదనపు కౌంటర్‌లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సేవల్లో మాత్రం నిర్ణీత సమయం వరకు మాత్రమే టాక్స్‌ కట్టించుకోవడం జరుగుతుందన్నారు. పాత నోట్లు మార్చుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్‌ 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చినందున, ఈ మేరకు కార్పొరేషన్‌లో కూడా గడువు పెంపు కోసం గడువు కోరతామని తెలిపారు.