పారిశుద్ధ్య కార్మికులకు ఆర్‌ఎస్‌ఆర్‌ వస్త్రాలు పంపిణీ

0
336
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : మన ప్రధాని నరేంద్రమోదీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపైన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనివారల పాత్ర ఎంతగానో ఉందని, ముఖ్యంగా వారు ఉదయాన్నే నిబద్ధతతో పనిచేస్తుండటం వలనే ఈ కార్యక్రమం విజయవంతమైందని, వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో ఆర్‌ఎస్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత శ్రీ రంకిరెడ్డి సుబ్బరాజు జన్మదినం సందర్భంగా ఈరోజు మోడల్‌ కాలనీలో వారి స్వగృహంలో పారిశుద్ధ్య పనివాళ్ళకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ సమాజం ఇంత పరిశుభ్రంగా ఉందంటే అది పారిశుద్ధ్య పనివారల గొప్పతనమేనని, వారిని ఈ విధంగా గౌరవించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే రాజమహేంద్రవరంలో ఎన్నో పార్కులు ఉన్నాయని, వాటిలో కొన్ని పార్కులు నిరుపయోగంగా ఉన్నాయని, వివిధ సంఘాలు లేదా వ్యక్తులు ఆయా పార్కులను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం వల్ల నగరం పచ్చదనంతో అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ఆర్‌ఎస్‌ఆర్‌ ఫౌండేషన్స్‌ ద్వారా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు అనుమతిస్తే రెండు పార్కులను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని నిశ్చయించామని తెలిపారు.