పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలి

0
122
కమిషనర్‌ను కోరిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 : నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వాన్నంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు. ఈరోజు ఉదయం  నగరపాలక సంస్థ ఆవరణలో ఆయనను కలిసి నగరంలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణపై చర్చించారు. కొన్ని ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి మురుగు నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందన్నారు. దాని కారణంగా దోమలు వ్యాప్తి చెంది, స్థానిక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. మరి ముఖ్యంగా నగరంలో దోమల కంటే పందుల సంచారం చాలా ఎక్కువగా ఉందని, వాటి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పందులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల వ్యాప్త చెందే వాతావరణమైనందున దోమలతోపాటు పందుల స్వైర విహారం కూడా ఎక్కువగా ఉండడం వల్ల నగర ప్రజలు ఆగచాట్లు పడుతున్నారని వివరించారు. దోమల నివారణకు నిత్యం ఫాగింగ్‌ చేయించాలని, అలాగే గతంలో ఉన్న ప్రతిపాదన మేరకు ఒక ఖాళీ స్థలం కేటాయించి దానిలోకి పందులను తరలించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ 22వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాలును వార్డు సచివాలయానికి కేటాయిస్తున్నందున ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు. 22వ డివిజన్‌, అలాగే చుట్టు ఉన్న మరో రెండు డివిజన్లకు కలిపి ఈ ఒక్కటే కమ్యూనిటీ హాలు ఉన్నందున… ఆయా డివిజన్ల పేద ప్రజలు వారి శుభ కార్యాలను దానిలో నిర్వహించుకుంటున్నారని, పేదల ప్రయోజనార్ధం నిర్మించిన సదరు కమ్యూనిటీ హాలును ఈ విధంగా సచివాలయం కోసం కేటాయించడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. అందువల్ల స్థానిక ప్రజల అభ్యర్ధన మేరకు ఆ భవాన్ని కమ్యూనిటీ హాలుగానే ఉంచి, వార్డు సచివాలయం కోసం ప్రత్యమ్నాయ మార్గం చూడాలని, పేదల ప్రజల పక్షాల ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా అంతకు ముందు  40వ డివిజన్‌లో పర్యటించి స్థానిక ప్రజలు వారి ద ష్టికి తీసుకువచ్చిన విద్యుత్‌ స్తంబాలు, కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలను పరిశీలించి ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్‌ మాటూరి రంగారావు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here