పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి 

0
365
ప్రమాణ స్వీకారం, అభినందనోత్సవంలో వైకాపా నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 24 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌  అన్నారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షునిగా నియమితులైన నందెపు శ్రీనివాస్‌ పదవీ స్వీకారం,అభినందన సత్కార కార్యక్రమం గత రాత్రి గౌతమఘాట్‌లోని బొమ్మన రామచంద్రరావు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కమ్యూనిటీ హాలులో పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగింది.  ఈ  కార్యక్రమంలో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌  వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నగర అధ్యక్షునిగా నందెపుతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ  సందర్భంగా నందెపు మాట్లాడుతూ  కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానన్నారు.తనకు నగర అధ్యక్ష పదవి వచ్చేందుకు కృషి చేసిన వైవీ సుబ్బారెడ్డి, సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు రౌతు, ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మీలకు కృతజ్ఞతలు తెలిపారు.  రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ పేదల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మళ్ళీ జగన్‌ వస్తేనే అమలులోకి వస్తాయన్నారు. రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ శ్రీనివాస్‌ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. చాంబర్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ  తెదేపా పాలనలో చిన్న వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, వర్తక, వ్యాపారుల సమస్యలను జగన్‌తో స్వయంగా చెప్పగలిగిన ప్రతినిధి నందెపు శ్రీనివాస్‌ నగర అద్యక్షునిగా నియామకం కావడం అభినందనీయమన్నారు. అనంతరం నందెపుని వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రౌతు సూర్యప్రకాశరావుల సమక్షంలో  గజమాల, వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్రెడాయి రాష్ట్ర నాయకులు బుడ్డిగ శ్రీనివాస్‌, కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంత శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, కురిమిల్లి అనురాధ,  పార్టీ రాష్ట్ర నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మార్తి నాగేశ్వరరావు, సుంకర చిన్ని, గుర్రం గౌతమ్‌, పార్లమెంటరీ జిల్లా నాయకులు కానుబోయిన సాగర్‌, మాసా రాంజోగ్‌,  లంక సత్యనారాయణ, అడపా శ్రీహరి, ఆర్‌వీఎస్‌ చౌదరి, మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మీ, వాకచర్ల కృష్ణ,  నీలపాల తమ్మారావు, తామాడ సుశీల,  మార్తి లక్ష్మీ, మజ్జి అప్పారావు, నరవ గోపాలకృష్ణ, సయ్యద్‌ రబ్బానీ, సాలా సావిత్రి, మరుకుర్తి కుమార్‌ యాదవ్‌, నీలి ఆనంద్‌, కోడి కోట, పెదిరెడ్ల శ్రీనివాస్‌,  ఉప్పాడ కోటరెడ్డి, పతివాడ రమేష్‌బాబు, కాటం రజనీ కాంత్‌, డా. కృష్ణారావు, మొహిద్దీన్‌ పిచ్చాయ్‌,  పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్‌, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, పొలసానపల్లి హనుమంతరావు, వలవల దుర్గా ప్రసాద్‌,  వంటెద్దు సూరిబాబు, సుంకర శ్రీను, పెంకే సురేష్‌, ఆముదాల పెదబాబు,ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.
పార్టీని విజయపథంలో నడపండి : రాష్ట్ర నేతల పిలుపు
ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యత పూర్తిగా నందెపు శ్రీనివాస్‌దేనని,వర్తక రంగంలో జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వహించిన నందెపు శ్రీనివాస్‌ జిల్లాలోని వర్తక, వాణిజ్య సంఘాలను పార్టీ వైపు నడిపించాలన్నారు.  సుబ్బారెడ్డి మాట్లాడుతూ  రెండు నియోజకవర్గాలే కాకుండా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే స్ధానాల గెలుపునకు తన వ్యాపార పరిచయాలను ఉపయోగించుకుని పనిచేయాలని కోరారు. జిల్లాలోని వ్యాపార, వర్తక సంఘాలను సంఘటిత పర్చి పార్టీ విజయానికి కృషి చేయాలని దిశా నిర్ధేశం చేశారు.  నందెపు శ్రీనివాస్‌కు బృహత్తర బాధ్యతలు  అప్పగించేందుకు తాము వచ్చినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు.  ఎన్నికల ముందు సరైన వ్యక్తికి నగర బాధ్యతలను  పార్టీ అధ్యక్షుడు జగన్‌ అప్పగించారని కొనియాడారు. పార్టీ విజయం కోసం పనిచేయాలని  కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సూచించారు. జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ  ఎమ్మెల్యే గోరంట్ల దోపిడీ వ్యవస్థకు దారులు తీస్తున్నారని ఆరోపించారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కోనసీమ వాసైన నందెపు శ్రీనివాస్‌ తండ్రి వెంకట్రావ్‌ కౌన్సిలర్‌గా పనిచేశారని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్‌కు జిల్లా వ్యాప్తంగా వర్తకులతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, పీఏసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయ్‌,  రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు  కవురు శ్రీనివాస్‌, పిఠాపురం కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ
సత్కార సభకు ముందు పార్టీ శ్రేణులు గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బైక్‌లు, కార్లతో యువత వైఎస్సార్‌ సీపీ జెండాలను చేత పట్టి జై జగన్‌ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు.  తొలుత పార్టీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి భక్త్యాంజలి ఘటించారు. అనంతరం దేవీచౌక్‌, లక్ష్మీవారపుపేట, కోటగుమ్మం, మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ సభాస్థలికి చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here