పాలన వికేంద్రీకరణ నేరమా ?

0
61
రాష్ట్రాభివృద్ధిలో తెదేపా సైంధవ పాత్ర – జగన్‌కు మద్దతుగా దశలవారీ కార్యక్రమాలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు
రాజమహేంద్రవరం, జనవరి 25: భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబునాయుడు తీరును నిరసిస్తూ వివిధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటి కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. పార్టీకి చెందిన వివిధ విభాగాల ముఖ్య నాయకులతో కలిసి సిటి కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సిఎం జగన్‌ సంకల్పించి ముందుకు వెళ్తుంటే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు,శాసనమండలిలో వారి ప్రవర్తన చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మంటగలిపి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. శాసనమండలిలో చైర్మన్‌ని తప్పుదోవ పట్టించి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. వెనుకబడిన జిల్లాలను ముందుకు తీసుకువెళ్ళాలని జగన్‌ ప్రయత్నిస్తుంటే కుట్రలతో రాజ్యాంగానికి తూట్లు పొడవడం దారణమన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు నిరసనగా విద్యార్ధి, యవజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్ధి విభాగంలో ఆధ్వర్యాన ఈరోజు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేస్తారని తెలిపారు. 27న యువజన విభాగం ఆధ్వర్యంలో కంబాలచెరువు సెంటర్‌ నుండి కోటగుమ్మం సెంటర్‌ వరకు నిరసన పాదయాత్ర జరుగుతుందన్నారు. 28న విద్యా సంస్థల్లో విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించి ఎపి అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.29న యవజన విభాగం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, 30న రాష్ట్రపతికి పోస్టుకార్డుల ఉద్యమం జరుగుతుందన్నారు. సిఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని బలపరుస్తూ పోస్టుకార్డుల ఉద్యమం జరుగుతాయన్నారు. 31న అన్ని ప్రాంతాల జెఎసి నాయకులతో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాలపై మేధావులు,ప్రముఖులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు. ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గృహ నిర్భందాలని గగ్గోలు పెట్టారని, గోరంట్ల,గన్ని, ఆదిరెడ్డి లాంటి నాయకులైతే ఫర్వాలేదు గానీ చాలా మంది నాయకులు తమను గృహ నిర్భంధం చేయాలని పోలీసులను కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తాను సిటి కో ఆర్డినేటర్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత 21 డివిజన్లలో కమిటీలు నియమించానని, అయితే ఇటీవల డివిజన్ల పునర్విభజన జరిగినందున ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అందరితో కలిసి చర్చిస్తానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్‌, కేబుల్‌ రమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మీ, బిసి సెల్‌ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాటం రజనీకాంత్‌, ప్రచార కమిటి కన్వీనర్‌ పెదిరెడ్ల శ్రీనివాస్‌,  సేవాదళ్‌ కన్వీనర్‌ ఉప్పాడ కోటరెడ్డి, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు సయ్యద్‌ రబ్బానీ,యువజన విభాగం అధ్యక్షుడు మరుకుర్తి నరేష్‌ కుమార్‌,న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు మారిశెట్టి వెంకటేశ్వర రావు,నాయకులు మార్తి నాగేశ్వరరావు, సాలా సావిత్రి,గుడాల ప్రసాద్‌,గుడాల ఆదిలక్ష్మి, మత్యాల వీర అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here