పిఎంపి సంఘ వ్యవస్థాపక దినోత్సవం

0
295
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : సామాన్య మధ్య తరగతి ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంటూ ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సీనియర్‌ జర్నలిస్ట్‌ సూర్య దినపత్రిక సంపాదకులు వి.ఎస్‌.ఎస్‌.కృష్ణకుమార్‌ అన్నారు. ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక దినోత్సవం రాజేంద్రనగర్‌లోని వసుంధర ప్రాథమిక వైద్యాలయం వద్ద సోమవారం నిర్వహించారు. అసోసియేషన్‌ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్‌ ఆర్‌.కె.భరద్వాజ విగ్రహానికి అసోసియేషన్‌ సభ్యులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు మందులు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కృష్ణకుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య వ్యవస్థ మరింత అభివృద్ధి చెందాలని, అందుకు అసోసియేషన్‌ కృషిచేయాలన్నారు. ఎ.పి. ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థతో సమానంగా ప్రాథమిక వైద్యులు అనేక కుటుంబాలతో పెనవేసుకున్నారని ప్రాథమిక వైద్యులు చూపిస్తున్న సేవా నిరతి అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా అధ్యక్షులు కె.ఎస్‌.ఎన్‌.బాబు, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,  జిల్లా కోశాధికారి గంగుమళ్ళ రాంబాబు, ఉపాధ్యక్షులు కె.ఎస్‌.ప్రసాద్‌, సలహాదారులు ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, జర్నల్‌ సబ్‌ ఎడిటర్‌ జయసూర్యలు ప్రసంగించారు. కె.సత్యం, పి.వాసు, పి.అరవిందం, కె.మాసరరాజు, ఎం.ఎస్‌.ప్రకాష్‌, ఎం.వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.