పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో వైఎస్‌ విగ్రహానికి.. జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం

0
299
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 :  బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి నిలుస్తున్నారని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. బిసి డిక్లరేషన్‌ ప్రకటించడం ద్వారా బిసిలను తానున్నానంటూ ముందుకు వచ్చారన్నారు. వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో బిసి డిక్లరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి.. వైకాపా అధినేత జగన్‌ ఫ్లెక్సీకి  పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా మార్గాని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బిసిల సంక్షేమానికి ఈ ఐదేళ్లలో 18 వేల కోట్లు ఖర్చుపెడితే జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 75 వేల కోట్లు ఖర్చుపెడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఏలూరులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన బిసి గర్జనకు లక్షలాదిగా జనప్రభంజనం తరలివచ్చిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్‌ నిలుస్తున్నారన్నారు. వైకాపా సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ బిసి డిక్లరేషన్‌ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బిసిల అభ్యున్నతికి జగన్‌ ఇచ్చిన భరోసా అందరికి మేలు చేస్తుందన్నారు. బిసిల అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని మరోసారి జగన్‌ స్పష్టం చేసారన్నారు. కార్యక్రమంలో వైకాపా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, కురుమెల్లి అనూరాధ, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్‌రెడ్డి, కాళే చిన్ని, మార్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, ఇసుకపల్లి శ్రీనివాస్‌, మెహీద్దీన్‌ పిచ్చయ్‌, మార్గాని చంటిబాబు, అందనాపల్లి సత్యనారాయణ, సంకిస భవానీప్రియ, భాషా, షేక్‌ హసీనా, షేక్‌ హసన్‌, రొక్కం త్రినాధ్‌, వై.ఉదయ భాస్కర్‌, కోడి కోటా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here