పుష్కరఘాట్‌లో దశకోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం

0
117

రాజమహేంద్రవరం, మార్చి 20 : శ్రీరామతత్త్వం ప్రచారంలో భాగంగా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గత ఏడేళ్ళుగా గోటితో ఒడ్లు ఒలిచి శ్రీరామ నామస్మరణతో కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సప్తకోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ఈరోజు ప్రారంభించారు. 45 గ్రామాలు, 25 మండలాలలో 3వేలమంది శ్రీరామ నామంతో గోటితో ఒడ్లు ఒలిచి భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు కోటి 60 లక్షల తలంబ్రాలకు వానర హారతి కార్యక్రమాన్ని పుష్కరఘాట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ సీత హనుమ అష్టోత్తర శతనామ స్తోత్రం నిర్వహించారు. ముందుగా కలశాలకు అభిషేకం చేసి వాటిలో కోటి తలంబ్రాలు నింపి వానర హారతి, గోదావరి హారతి, విశ్వశాంతి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని వలె ధర్మ కార్యాచరణ ఆచరించాలని కల్యాణం అప్పారావు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here