పుష్కరాల తొక్కిసలాటపై పునర్విచారణ

0
121
అవసరమైతే  ప్రత్యేక కమిషన్‌ నియామకం
రాజమహేంద్రవరం, జనవరి 11 : గోదావరి పుష్కరాల తొక్కిసలాట సంఘటనపై పునర్విచారణకు సిఫార్స్‌ చేస్తున్నట్లు శాసన సభ హామీల కమిటీ ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణ తెలిపారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో శాసన సభ హామీల కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో గత పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందడంతోపాటు, అనేక మంది గాయాలపాలైయిన సంఘటన పాఠకులకు విధితమే. అయితే శనివారం జరిగిన శాసన సభ హామీల అమలు కమిటీ ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణ సమక్షంలో జరిగిన సమావేశంలో పుష్కర తొక్కిసలాట సంఘటనా, జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ నివేదికపై చర్చ సాగింది. ఈ సందర్భంగా పుష్కర తొక్కిసలాట సంఘటనకు సంబంధించిన నివేదిక సారాంశంపై ఆరోగ్య శాఖ అధికారులను కమిటీ ఛైర్మన్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సంబంధిత నివేదికను తమకు రాలేదని, అఖరికి జిల్లా కలెక్టర్‌కు సైతం ఆ నివేదిక రాలేదని ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై శాసన సభ హామీల కమిటీ ఛైర్మన్‌ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట సంఘటనపై పునర్విచారణ చేసేందుకు తమ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్స్‌ చేస్తుందని, అవసరమైతే ఈ సంఘటనపై ప్రత్యేక కమిషన్‌ చేసి పునర్విచారణ చేసేలా ప్రభుత్వానికి సూచించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులతోపాటు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here