పుష్కర ఘాట్‌లో మయూర గణపతి 

0
452
గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలకు సన్నద్ధం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 12 : స్థానిక పుష్కర ఘాట్‌ వద్ద గత తొమ్మిదేళ్లుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలను రెట్టించిన ఉత్సాహంతో ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు గణేష్‌ ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకర్రావు, బైర్రాజు ప్రసాదరాజు, తోట సుబ్బారావు, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా పుష్కర ఘాట్‌ వద్ద అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొమ్మిదేళ్లుగా ఒక్కో సంవత్సరం ఒక్కో అవతారంలో గణపతిని ప్రతిష్టిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చవితి సందర్భంగా మయూరి గణపతిని ప్రతిష్టస్తున్నట్లు తెలిపారు. నెమలి ఈకలతో తయారు చేసిన గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నగర ప్రజలతోపాటు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు జక్కంపూడి రాజా, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here