పుష్కర వనం ప్రారంభం – ఫారెస్ట్‌ అకాడమీ శంకుస్థాపన  

0
306
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20 : దివాన్‌చెరువు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గోదావరి పుష్కర వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత రాత్రి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ఫారెస్ట్‌ అకాడమీకి సీఎం శంకుస్థాపన చేశారు. వన్యప్రాణులకు సంబంధించి రూపొందించిన ఎమరాల్డ్‌ ప్యారడైజ్‌ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. పుష్కర వనం ప్రారంభంలో చంద్రబాబు కొద్దిసేపు సైకిల్‌ తొక్కి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.