పూలే అంబేద్కర్‌ ఆశయాలను సాదిద్ధాం 

0
325
ప్రారంభమైన మూల్‌నివాసీ సంఘ్‌ రాష్ట్ర సదస్సు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4 : సమ, సమాజ స్ధాపన కోసం, పూలే, అంబేద్కర్‌ ఆశయాలను సాదిద్ధామని మూల్‌నివాసీ, బామ్‌సెఫ్‌ నేతలు పిలుపునిచ్చారు. మూల్‌ నివాసీ సంఘ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి సదస్సు ఈరోజు స్ధానిక శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ప్రారంభమయ్యింది. ముందుగా కళాకేంద్రం వద్ద మూల్‌నివాసీ పతాకాన్ని జాతీయ అధ్యక్షులు కుర్మి హేమరాజ్‌సింగ్‌ పటేల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూల్‌నివాసీలతో ప్రతిజ్ఞ చేయించారు. బ్రాహ్మణ భావజాలంతో మానసిక బానిసలుగా తయారైన మూల్‌నివాసీలను బానిసత్వం నుంచి బయటపడేవరకు నిరంతం శ్రమించాలని, నిరంతరం పూలే, పెరియార్‌, బాబాసాహెబ్‌ భావజాలాన్ని ఎవరికి వారు ఆయా ప్రాంతాలలో వ్యాప్తి చేయాలని, తద్వారా  సమాజంలో చైతన్య దీప్తిని సజీవంగా ఉంచుతామని, శారీరక దారుడ్యాన్ని, మేధస్సును, ఆర్ధిక వనరులను పూర్తిగా అంబేద్కర్‌ పోరాటాన్ని నిజమైన దిశలో పయనింపచేయడానికి వినియోగిస్తామని, పొగడ్తలకు, అవమానాలకు, గౌరవ, అగౌరవాలకు, చీదరపు, చిత్కారాలకు అతీతంగా నిలబడి, మూల్‌ నివాసీ బహుజనులందరూ సమాజంలో సమానులుగా గుర్తింపబబేవరకు పోరాటం కొనసాగిస్తామని, కుటుంబంలో ప్రతి ఒక్కరినీ, స్నేహితులను బంధువులను పూలే, అంబేద్కర్‌ పోరాటంలో భాగస్వాములుగా చేసిన పోరాటానికి, సామాజిక మార్పునకు నూతన ఉత్తేజం కలిగిస్తామని ప్రతిజ్ఞ బూనారు. ఈ కార్యక్రమంలో బామ్‌సెఫ్‌ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లా గంగాధర్‌, మూల్‌నివాసీ సంఘ్‌ కేంద్ర కమిటీ సభ్యులు, ఎపి ఇన్‌ఛార్జి నయనాల కృష్ణారావు, బామ్‌సెఫ్‌, మూల్‌నివాసీ నాయకులు తిలక్‌కుమార్‌, అనుసూరి ఆదినారాయణ, మార్గాని చంటిబాబు, నల్లా అంబిక, భట్టు విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నయనాల కృష్ణారావు మాట్లాడుతూ మూల్‌నివాజీ సంఘ్‌ తొలి రాష్ట్ర సదస్సును ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ‘ఓబిసి, ఎస్సీ, ఎస్టీలు ఒకే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు’ అనే అంశంపై చైతన్య పూరిత సమావేశం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వంలో మహాత్మ జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.