పెండింగ్‌ పనులపై దృష్టి సారించండి

0
202
కంబాలచెరువు పార్కుపై కమిషనర్‌కు  గన్ని కృష్ణ లేఖ
టు
కమిషనర్‌
నగరపాలక సంస్థ
రాజమహేంద్రవరం
విషయం:- కంబాలచెరువు పార్కు పెండింగ్‌ పనుల నిమిత్తం
సర్‌ నమస్తే, నగర నడిబొడ్డున ఉన్న కంబాలచెరువు పార్కును అభివృద్ధి చేసే విషయంలో గత కమిషనర్‌ విజయరామరాజు గారు, మీరు చూపిన చొరవ అభినందనీయం. రాజమహేంద్రవరం ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మీరు చేసిన కృషి మరువలేనిది.అయితే మంగళవారం సాయంత్రం వేళలో కంబాలచెరువు పార్కును నేను సందర్శించగా వాకర్స్‌, ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేసి అభినందిస్తున్నారు.  నా సందర్శనలో గతంలో అనుకున్న  కొన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి.రాత్రి సమయంలో పార్కుకు అనుకున్నంతగా లైటింగ్‌ లేకపోవడం, ఎంపి మాగంటి మురళీమోహన్‌ గారు పార్కులో శంకుస్థాపన చేసిన జాతీయ జెండా ఏర్పాటు పనులు ప్రారంభించకపోవడం, పార్కు మధ్యలో వాటర్‌ ఫౌంటెన్‌ ప్రారంభించకపోవడం, మరుగుదొడ్ల వద్ద పుట్టలు ఉండటం, అక్కడక్కడ చెత్త కనిపించింది. దీంతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ వారు చేస్తున్న పనులు నత్తనడకన జరుగుతుండటం వలన వాకర్స్‌  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆ శాఖ ఎస్‌.ఈ.గారితో నేను మాట్లాడి పనులు వేగంగా చేయాలని కోరాను.మీరు కూడా త్వరితంగా జరిగేలా ఆదేశించాలని సూచిస్తున్నాను. అలాగే పార్కులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశారు. అయితే వాటికి లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు పురుషుల కోరిక మేరకు సింగిల్‌, డబుల్‌ బార్‌లను ఏర్పాటు చేయడానికి అవకాశాలు చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే పార్కులో అభివద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని మనవి చేస్తున్నాను. వేసవి సందర్భంగా వందలాది మంది ప్రజలు పార్కును సందర్శించి సేదదీరుతున్నారు. పార్కును అభివృద్ధి చేసిన విధంగానే నిర్వహణ కూడా చాలా ప్రాముఖ్యమైనది. పార్కు నిర్వాహణకు నగరపాలక సంస్థతో పాటు గుడా భాగస్వామిగా నిలిచేందుకు ఇప్పటికే బోర్డు మీటింగ్‌లో తీర్మానం కూడా జరిగింది. మీరు, మా గుడా వైస్‌ చైర్మన్‌ ఒక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నాను. పై విషయాలను పరిశీలించి వాటిని వేగవంతంగా పూర్తి చేస్తే ప్రజలు మరింత ఆనందిస్తారని తెలియజేస్తున్నాను..
                                                                      ఇట్లు
                                                                    గన్ని కష్ణ
                                                                   గుడా చైర్మన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here