పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన 

0
248
రాజమహేంద్రవరం, నవంబర్‌ 10 : కార్పొరెట్‌ సంస్థలకు దేశాన్ని దోచి పెట్టేందుకే ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారని పిసిసి కార్యదర్శి ముళ్ళ మాధవ్‌ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా జాంపేట గాంధీ విగ్రహం వద్ద గత సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం తప్ప పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉసురుమర్తి ఆనంద్‌, ప్రశాంత్‌కుమార్‌, ఉదయ్‌, ఫణి, విజయ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here