పేదలకు పెద్ద దిక్కుగా నిలిచిన జక్కంపూడి  

0
137
వర్ధంతి సభలో పలువురి నివాళి
రాజమహేంద్రవరం,అక్టోబర్‌ 9 : పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ఎల్లప్పుడూ ముందుకు వచ్చేవారని రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జక్కంపూడి ఆశయ సాధనకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక కంబాలచెరువు వద్ద జక్కంపూడి 8వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌, రాజానగరం ఎమ్మెల్యే, జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే చెల్లుబోయిన, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు జక్కంపూడి అందించిన సేవలను కొనియాడారు. చెల్లుబోయిన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధిలో జక్కంపూడి తనదైన ముద్ర వేసారన్నారు. మంత్రిగా జిల్లాలో అవసరమైన పనులు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన కుటుంబం కూడా అదే కోవలో ప్రజలకు అండగా నిలుస్తుండటం అభినందనీయమన్నారు. ఆయన తనయుడు ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ఆర్‌సిపి తరపున రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజలకు అండగా నిలబడే కుటుంబాలకు ఎప్పుడూ భవిష్యత్తు ఉంటుందనడానికి జక్కంపూడే నిదర్శనమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడంతో పాటు అందరి సహకారంతో జక్కంపూడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా కృషిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మింది నాగేంద్ర, భీమవరపు వెంకటేశ్వరరావు, వాకచర్ల కృష్ణ, వైసిపి నాయకులు నక్కా శ్రీనగేష్‌, కుక్కా తాతబ్బాయి, లంక సత్యనారాయణ, గుడాల ఆదిలక్ష్మి, కోడి కోటా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here