పేదల ఆనందాన్ని ఆవిరి చేయెద్దు

0
414
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : సొంతింటి కల నెరువేరుతుందని ఆనంద పడుతున్న వేళ విచారణ పేరుతో 450 మంది లబ్ధిదార్ల పేర్లను వెనక్కి పెట్టడం సరికాదని, పేదలకిచ్చే గృహాల విషయంలో రాజకీయాలు చేయెద్దని మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మీ కోరారు. మాజీ కార్పొరేటర్‌ వాకచర్ల కృష్ణ, బాధిత లబ్దిదారులతో కలిసి ఆమె ఈరోజు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. లబ్ధిదారుల వాటాను అప్పులు తెచ్చి ప్రభుత్వానికి చెల్లించారని, లబ్ధిదారులకు గృహాలను అప్పగిస్తున్న సమయంలో పేదవారి ఆశలపై నీళ్ళు జల్లడం సరికాదని, తక్ష ణమే అర్హులైన లబ్ధిదారులందరికి గృహాలు కేటాయించాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో తహ సీల్దార్‌ పి.వి.ప్రసాదరావును కోరారు.