పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

0
269
20వ డివిజన్‌లో ఉత్సాహంగా గడపగడపకూ వైకాపా
 
రాజమహేంద్రి, నవంబర్‌ 17 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి పేద ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు పిలుపునిచ్చారు. స్థానిక 20వ డివిజన్‌లో ఈరోజు గడపగడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మింది నాగేంద్ర, పిల్లి నిర్మల, డబ్బింగ్‌ రమేష్‌, ధవల కోటేశ్వరరావు, ధర్మాల శ్రీను, అంజిబాబు, దుంప లక్ష్మారెడ్డి, వి.వి.రమణరాజు, అనుసూరి రమణ, వెంకటరెడ్డి, కృష్ణప్రసాద్‌, శివప్రసాద్‌, అల్లూరి రవి, బైర్రెడ్డి జగదీష్‌, కోటిపల్లి విజయకుమార్‌, జాబిల్లి భాస్కరరావు పాల్గొన్నారు.