పేదల సంతృప్తే ధ్యేయంగా ఫించన్‌ మొత్తం రెట్టింపు 

0
209
సంక్షేమ పాలనకు దర్పణం సీఎం చంద్రబాబు నిర్ణయాలు : గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, జనవరి 13 : రాష్ట్రంలోని పేదల సంతృప్తి స్థాయిని పెంచడం కోసమే  ఆర్థిక ఇబ్బందులున్నా ఫించన్లను రెట్టింపు చేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పాలనకు సీఎం చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని మరో సారి నిరూపించుకున్నారని, నిరాదరణకు గురవుతున్న వారిని, వికలాంగులను, ఇతర వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతి నెలా ఇచ్చే ఫించన్లను రెట్టింపు చేసి వారి కళ్ళలో ఆనంద సంబరాలు నింపారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల లబ్ధిదారుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించి అధ్యయనం చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని వర్గాలకు మేలు చేకూరేలా నిర్ణయాలు  తీసుకోనున్నారని ప్రకటించారు. ఫించన్‌ రెట్టింపు వల్ల 54 లక్షల 14 వేల 592 మందికి ప్రయోజనం చేకూరుతుందని, త్వరలో డ్వాక్రా మహిళలకు అదనంగా ఆర్థిక పరిపుష్టి కలిగించే నిర్ణయాన్ని వెలువరించనున్నారని తెలిపారు. కొంత మంది వ్యక్తులు సీఎం అయిపోవాలన్న కోరికతో అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని, అలాంటి వ్యక్తులను నమ్మి రాష్ట్ర భవిష్యత్తుకు భంగం కలిగించవద్దని కోరారు. ఈ రాష్ట్రానికి దిశ,దశ చంద్రబాబు ఒక్కరేనని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పధంలో అగ్రభాగాన ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here