పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

0
303

వచ్చే ఏడాదికి రూ. 50 వేల కోట్లతో 19 లక్షల ఇళ్ళ నిర్మాణం

రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాజమహేంద్రవరం ఫిబ్రవరి 10 : రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు రూ.50 వేల కోట్లతో వచ్చే ఏడాది నాటికి 19 లక్షలు ఇళ్ళు నిర్మించి పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గ్రామీణ గృహానిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. స్ధానిక 46వ వార్డు ఆనంద్‌నగర్‌లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలో భాగంగా బెనిఫిసిరి లిడ్‌ కన్‌ష్ట్రక్షన్‌ (బి.యల్‌.సి) పథకం క్రింద లభ్దిదారుల సొంత స్ధలంలో నిర్మించుకుంటున్న గృహా నిర్మాణాలను పరిశీలించి లభ్దిదారులతో నిర్మాణ స్ధితిగతులను ప్రభుత్వ పరంగా అందిస్తున్న సబ్సిడీలపై అరాతీసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరములో సొంత స్ధలం కలిగిన లభ్దిదారులకు నగర పరిధిలో 2,186 గృహాలు సుమారు రూ. 76.5 కోట్లతో మంజూరు కాగా ఇప్పటివరకు 1240 గృహా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మిగిలినవి స్ధలాల సమస్యలు రోడ్డు మార్జిన్‌ల ఇబ్బందులు లబ్దిదారులకు యాజమాన్య హక్కులు పూర్తిగా సంక్రమించక పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కరానికి దృష్టి సారించడం జరిగిందని మంత్రి తెలిపారు. జియో ట్యాగింగ్‌ సబ్సిడీ నిధులు చెల్లింపులు, డేటా అప్‌లోడింగ్‌, మెటీరియల్‌ సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని లభ్దిదారులు మహాంతి నాగలక్ష్మి, వి.సత్యవేణి, లక్ష్మిలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. జాప్యాలు ఉంటే 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫీర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అయన తెలిపారు. ఈఫథకంలో కేంద్రప్రభుత్వం రూ.1.50,000, రాష్ట్రం 1,00,000 పూర్తి సభ్సిడిపై అందిస్తుందని లబ్దిదారుల వాటాగా రూ.25,000 బ్యాంకులో జమచేస్తే బ్యాంకువారు మరో రూ. 75,000 ఋణంగా మంజూరుచేస్తారని మంత్రి తెలిపారు. మొత్తం ఈ పథకం క్రింద రూ. 3,50,000తో గృహాన్ని నిర్మించుకోవాలని అయన సూచించారు. సెమీఆర్బన్‌ క్రింద జి ప్లస్‌2 గృహాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. మార్నె రామలక్ష్మికి గృహా మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదవారందరికి గృహాలను అందించే దిశగా పనిచేస్తోందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారందరికి పెద్ద ఎత్తున గృహాలను నిర్మించి పేదలకు అమితమైన అనందాన్ని కలిగించే దిశగా పనిచేస్తోందని మంత్రి పేర్కోన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల గృహా నిర్మాణ పధకాల ద్వారా సూమారు రూ.50,000 కోట్లతో సూమారు 19 లక్షల ఇళ్లు 2019 నాటికి నిర్మించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అదిరెడ్డి అప్పారావు, నగర శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, ఆనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నగర మేయర్‌ పంతం రజనీశేషాసాయి,కార్పోరేటర్‌ అగురు పద్మావతి,హౌసింగ్‌ పి.డి విరేశ్వర ప్రసాద్‌.ఇ.ఇ జి.సోములు, డి.నాగేశ్వరరావు, సమాచార శాఖ సంచాలకులు యం.ఫ్రాన్సిస్‌, తదితర శాఖల అధికారులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here