పేద కుటుంబానికి కార్పొరేటర్‌ ఆర్థిక సాయం

0
477
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 10 : స్థానిక 19వ డివిజన్‌లో అనారోగ్యంతో మృతి చెందిన బొంతు సాంబయ్య కుటుంబానికి కార్పొరేటర్‌ గొందేశి మాధవీలత హరనాథ్‌ ఆర్థిక సహాయం అందజేశారు. సాంబయ్య మృతితో తల్లడిల్లుతున్న ఆ కుటుంబాన్ని ఓదార్చి రూ.5వేలు సాయం అందించారు. చంద్రన్న బీమాలో పేరు నమోదు చేయించుకున్నామని బాధిత కుటుంబీకులు చెబుతున్నప్పటికీ రికార్డ్స్‌లో అతని పేరు లేనందున చంద్రన్న బీమా పథకం ఆ కుటుంబానికి వర్తించలేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు నమోదయ్యాయో లేదో చూసుకోవాలని మాధవీలత కోరారు.  ఈ కార్యక్రమంలో గొందేశి హరనాథ్‌రెడ్డి, నక్కా శాంతారామ్‌, దాడి వేణు, బొంతు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here