పేపరుమిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రితో చర్చలు

0
289
రాజమహేంద్రవరం ఆగస్టు 20 : ఇంటర్నేషనల్‌ పేపరుమిల్లులో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈరోజు అమరావతిలో కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణతో కార్మిక నాయకులు సమావేశమయ్యారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సారధ్యంలో ఈ సమావేశం జరిగింది. గత కొద్దికాలంగా కార్మికులకు, యాజమాన్యం మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి సామరస్య పూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈసమావేశాన్ని ఏర్పాటు చేశారు. పేపరుమిల్లులోని కార్మిక సంఘాల నాయకులతోపాటు పేపరుమిల్లు యాజమాన్యం తరపున ఉన్నతాధికారులు, కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటి కమిషనర్‌,  రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, పేపర్‌మిల్లు కార్మిక సంఘం నాయకులు సైదుబాబు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here