పేపర్‌మిల్‌ వద్ద నవరాత్రుల ముగింపు అన్నదానం 

0
234
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 : దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా పేపర్‌మిల్‌ సమీపంలో కాతేరురోడ్‌లో శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి చేతులమీదుగా  మూడువేల అధ్యక్షులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి చేతులమీదుగా మూడువేల మందికి ఈరోజు అన్న సమారాధన జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ పూజి కొత్తపల్లి సోమసుందరం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి 11 రోజులు కుంకుమ పూజలు, విశేష పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, అధ్యక్షులు చామంతుల ప్రసాద్‌, కమిటీ మెంబర్లు వింధ్యమూరి భాస్కరరావు, ఇప్పిలి శ్రీనివాస్‌, దుంబా శ్రీను, సిరిపాల వరప్రసాద్‌, కొత్తపల్లి సోమసుందరం, పండు, భక్తులు పాల్గొన్నారు.