పేర్లను నమోదు చేసుకుని సహాయం అందుకోండి

0
126
ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే రాజా పిలుపు
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 25 : పేద ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వారికి సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారని రాజానగరం శాసనసభ్యులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. నగరంలోని సుబ్రహ్మణ్యం మైదానంలో జక్కంపూడి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ఈరోజు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాజా మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌ తమ పేర్లు నమోదు చేయంచుకోవాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 60 వేలకు పైగా ఆటోలు ఉన్నాయని, ఇప్పటివరకు 17 వేల మంది  ఆటో డ్రైవర్లు వారి పేర్లు నమోదు చేయంచుకున్నారని,మిగతా వారు కూడా తమ పేర్లు నమోదు చేయంచుకుని ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయం పొందేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మన రాజ్‌ కుమార్‌, జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిళారెడ్డి, పోలు విజయలక్ష్మి,  గెడ్డం రమణ, నక్కా శ్రీ నగేష్‌, నరవ గోపాలక ష్ణ, అడపా రాజు, కొల్లిమళ్ళ రఘు, గుడాల ఆదిలక్ష్మి,ఈతకోట బాపన సుధారాణి, సంకిస భవానిప్రియ,పాలూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here