పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదు

0
113
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీ శ హెచ్చరిక
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 :  జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ఎటువంటి తప్పులు జరిగిన క్షమించేదిలేదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీ శ హెచ్చరించారు. బుధవారం స్థానిక రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో  డివిజన్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీకి ముందుగా ధాన్యం సేకరణ చేయటం జరుగుతుందని, దానికొరకు మనం సేకరించే ధాన్యం నాణ్యతతో కూడినదిగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఏటువంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో 13 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం తరపున జిల్లాలో ఏర్పాటు చేసిన 335 ధాన్యం కొనులు కేంద్రాలలో 11 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి నాణ్యమైన బియ్యం కొరకు మిల్లర్లకు పంపించటం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు తీసుకున్న నిర్ణయానికి మనం కూడా సహకరించి వలసి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. సన్న బియ్యం పంపిణి చేయడం దేశంలో మన రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకం వైపు అన్ని రాష్ట్రాలు చుస్తున్నాయని, బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకునేందుకు అందరూ సహకరించాలని అన్నారు. సాధారణ రకానికి క్వింటాకు రూ.1815/-, ” ఏ” గ్రేడ్‌ రకానికి 1835/-రైతులకు చెల్లించటం జరుగుతుందని, ఆ విధంగా కొనుగోలు చేయవలసి ఉంటుందని అన్నారు. ఇది వరలో మాదిరిగా కాకుండా వ్యవసాయ శాఖ ద్వారా ఏ రైతు ఏ రకం ధాన్యం పండించిన వివరాలు ఇవ్వడం జరుగుతుందని ఆవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. జిల్లాకు 54 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధాన్యంలో తేమ వంటివి జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, జిల్లా పౌరసరఫరా మేనేజరు ఈ.ఎన్‌.జయరాములు, డి.ఎస్‌.ఓ పి.ప్రసాద్‌ రావు, ఎంఎస్‌ఓ పి.భీమాశంకర్‌, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here