పోరు ఫలించింది….సమస్య తీరింది

0
293
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆందోళనతో దిగొచ్చిన అధికార యంత్రాంగం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : నగరంలో కొన్ని చౌక ధర దుకాణాలను సీజ్‌ చేయడం వల్ల దాదాపు మూడు వేల మంది వినియోగదారులకు రేషన్‌ సరకులు అందడం లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  సబ్‌  కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనకు అధికార యంత్రాంగం స్పందించిందని, సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ చొరవతో వినియోగదారులు నాలుగు నెలల సరకులను అందజేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి తెలిపారు. తాము ఆందోళన చేపట్టగా సబ్‌ కలెక్టర్‌ స్పందించి తమ నాయకులతో చర్చించారని, ఆ చర్చల్లో జిల్లా అధ్యక్షులు కురుసాల కన్నబాబు, సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, వేగుళ్ళ లీలాకృష్ణ, కర్రి పాపారాయుడు, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి,మజ్జి నూకరత్నం,  మింది నాగేంద్ర,మేడపాటి అనిల్‌ రెడ్డి  చర్చలో పాల్గొన్నారని తెలిపారు. చర్చల్లో సమస్యను అర్ధం చేసుకున్న సబ్‌ కలెక్టర్‌ ఈరోజు  వినియోగదారులకు నాలుగు నెలల సరకులను అందజేశారని తెలిపారు.