పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం

0
306

ప్రాజెక్ట్‌ను సందర్శించిన సన్‌ రైజర్స్‌

రాజమహేంద్రవరం, జనవరి 22 : బహుళార్ధక సాధక ప్రాజెక్ట్‌ పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఇది విజయవంతంగా పూర్తి కావాలని సన్‌ రైజర్స్‌ రైడింగ్‌ క్లబ్‌ అడ్మిన్‌ విక్రమ్‌ సందీప్‌చౌదరి అన్నారు. వివిధ కార్యక్రమాలపై, అంశాలపై చైతన్యం కలిగించేందుకు బుల్లెట్లతో ర్యాలీ చేపట్టే ఈ బృందం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించింది. రాజమహేంద్రవరం నుంచి క్లబ్‌ ప్రతినిధులు బుల్లెట్లపై వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను సందర్శించారు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్‌ ప్రజల జీవనాడి అని, ఇది పూర్తయితే ఆంధ్రా తెలంగాణాలతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పవన్‌కుమార్‌, వంశీ, రామకృష్ణరాజు, హుండాయ్‌ వర్మ, మద్దు సతీష్‌, కేదారిశెట్టి గోవింద్‌, భగవాన్‌ దాస్‌, కె.పవన్‌, కె.ప్రవీణ్‌, హరి, ఎన్‌.ప్రవీణ్‌, భాస్కర్‌, రఘువర్మ, సురేష్‌గుప్తా, ఎల్‌ఇడి శివ, నాగ శ్యామ్‌, చంద్రశేఖర్‌, వై.కె.శ్రీనివాస్‌, దేశిన సాయి, జంగాల రాజేష్‌, హరీష్‌, అభిరామ్‌, మూర్తి, జూనియర్‌ మూర్తి, దర్శన్‌, సింధు, యువన్‌, రమేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here