పోలవరంపై సీపిఐ ఆధ్వర్యంలో 18న రౌండ్‌ టేబుల్‌  

0
294
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 16 : పోలవరం ప్రాజక్ట్‌ నిర్వాశితుల సమస్యలను చర్చించేందుకు  ఈ నెల 18న రాజమహేంద్రవరంలో సీపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సహాయ కార్యదర్శి కిర్ల కృష్ణ,నగర కార్యదర్శి నల్లా రామారావు తెలిపారు. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజక్ట్‌గా ప్రకటించినా నిధులు మంజూరులో నాన్పుడి ధోరణి అవలంభిస్తోందన్నారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్న సీఎం నిర్వాశితుల పునరావాసం కోసం ఏ ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ద్వారా ప్యాకేజీ ప్రకటించకుండా నిర్వాశితుల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తున్నారని, పట్టిసీమ తరహలో నిర్వాశితులకు ప్యాకేజీ ప్రకటించాలని డి మాండ్‌ చేశారు. 18న జరిగే రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ప్రముఖ ఆర్థిక వేత్త పెంటపాటి పుల్లారావు తదితరులు పాల్గొంటారని తెలిపారు.