పోలియో పట్ల అప్రమత్తత అవసరం

0
122
రాజమహేంద్రవరం, మార్చి 10 : పోలియో మహమ్మారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి తరిమి కొట్టాలని, పిల్లలకు పోలియో చుక్కలు వేసే విషయంలో అలసత్వం వహించరాదని నగరపాలక సంస్థ మేనేజర్‌ సి.హెచ్‌.శ్రీనివాసరావు అన్నారు. పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపీ సండేలో పోలియో చుక్కలు వేశారు. సిహెచ్‌ శ్రీనివాసరావు, ఎం.హెచ్‌.ఒ. డా ఎంవిఆర్‌ మూర్తి, స్కూల్స్‌ సూపర్వైజర్‌ దుర్గాప్రసాద్‌, ఉపాధ్యాయురాలు రమాదేవి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here