పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

0
110
అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో స్మృతి పెరేడ్‌ నిర్వహణ – హాజరైన డిఐజి ఎ.ఎస్‌.ఖాన్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : దేశ, రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు మరువలేనివని ఏలూరు డిఐజి ఎ.ఎస్‌.ఖాన్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అర్బన్‌ ఎస్సీ కార్యాలయంలో స్మృతి పెరేడ్‌ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఎ.ఎస్‌.ఖాన్‌తోపాటు అర్బన్‌ ఎస్పీ డాక్టర్‌ షిమోషి భాజ్‌పాయ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన  రక్తదాన శిబిరాలు, మారధాన్‌ పరుగు, క్యాండిల్‌ ర్యాలీ, ఆయుధాల ప్రదర్శన, వ్యాస రచన, పెయింటింగ్‌, కార్టూన్‌ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల సేవలు, విధులపై అవగాహన కల్పించామన్నారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ పరంజ్యోతి భార్యకు అమరవీరుల స్మృతి జ్ఞాపికను ఎ.ఎస్‌.ఖాన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.లతా మాధురి, జి.మురళీకృష్ణ, వై.వి.రమణకుమార్‌, డిఎస్పీలు కె.వి.సత్యనారాయణ, డి.శ్రీనివాసరెడ్డి, పి.సత్తిరాజు, ఎస్‌.వెంకట్రావు, జె.వి.సంతోష్‌, ఎ.టి.వి.రవికుమార్‌, ఎం.వెంకటేశ్వర్లు, పి.సత్యనారాయణ, ఆర్‌.సత్యానందం, సిఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here