ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషాన్ని వెతుక్కున్న మదర్‌

0
119
మదర్‌ ధెరిస్సా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే భవాని
రాజమహేంద్రవరం, ఆగస్టు 26 : పనులకు సేవ చేసేందుకే మదర్‌ ధెరిస్సా జన్మించారని, తన జీవితాంతం ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషాన్ని వెతుకున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మదర్‌ ధెరిస్సా జయంతి సందర్భంగా నగరంలోని 30, 46వ డివిజన్లలో జరిగిన వేడుకలకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 30వ డివిజన్‌ చర్చిపేటలో మధర్‌ ధెరిస్సా యంగ్‌ స్టార్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు చాపల చిన్నరాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదలు, వృద్ధులకు పెన్షన్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే ధనరాజ్‌ ఆధ్వర్యంలో రామదాసుపేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యావత్‌ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు… ముఖ్యంగా మన దేశ ప్రజల మనస్సులో నిండిపోయిన రూపం మధర్‌ ధెరిస్సాదని కొనియాడారు. పరుల సేవ కోసమే జన్మించిన ఆమె ఆజన్మాంతం సేవలోనే గడిపారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు జన్మించి తమ జీవితాలను దేశ సేవకు అంకితం చేశారు. అయితే మన దేశం కాకపోయినా అన్యదేశాలలోని దైన్యతను, ప్రజలు పడే అవస్థలను చూచి ఇక్కడకు వచ్చి సేవ చేశారన్నారు. కాని మన దేశం కాకపోయినా మన దేశంలోని దీనుల అవస్థలను చూచి వారికి తన వంతు ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో ఆజన్మాంతం వివాహము చేసుకొనకుండా మన దేశానికి వచ్చిన ప్రజలకు సేవలందించిన ఆ మహిళే… మనం సేవా మూర్తిగా పిలుచుకునే మదర్‌ ధెరిస్సా అన్నారు. అటువంటి సేవా మూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఛాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, బుడ్డిగ రవి, ఆయా సంఘాల నాయకులు, డివిజన్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here