ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు

0
137
జగన్‌ సర్కార్‌కు తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరిక
విజయవాడ, ఆగస్టు 13 :  ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వారు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని పాలక పక్షాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హెచ్చరించారు.  విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈరోజు జరిగిన తెదేపా రాష్ట్రస్థాయి విస్త త సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పద్ధతిగా, మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, అయితే అందుకు విరుద్ధంగా విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్‌ ‘పులివెందుల పంచాయితీలు’ రాష్ట్రంలో చేయనివ్వమని ఆయన హెచ్చరించారు.  బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదని,  సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. మంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు పలికామని చెప్పారు. రాష్ట్రంలో అభివ ద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.” పేదవాడికి రూ.5 కే అన్నం పెట్టే ‘అన్న’ క్యాంటీన్లను మూసివేశారని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటన్నిటిపైనా పోరాడేందుకు కార్యాచరణ రూపొందించుకుందాం” అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌- కేసీఆర్‌ల ఆలోచనలు ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని, ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని చేసే కార్యక్రమం కాదని చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని ఆయన  హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here