ప్రజల్లోకి సర్కారీ పథకాల్ని తీసుకెళ్ళండి

0
123
సేవా మిత్రల శిక్షణా కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి సూచించారు. ఈరోజు పార్లమెంటరీ నాయకత్వ శిక్షణా కేంద్రం వద్ద నగరంలోని 221 బూత్‌లకు సంబంధించిన సేవా మిత్రలలో 200 మందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవా మిత్రులు పనిచేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారికి చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here