ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : ఆకుల

0
201

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21 : ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ఈరోజు తన కార్యాలయంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. నగరానికి చెందిన పండూరి శ్రీనివాస్‌కు రూ.లక్ష 60వేలు, దోనబోయిన హరికృష్ణకు రూ.60వేలు, ఎం.కుసుమకుమారికి రూ.20వేలు, ఇ.కనకారావుకు రూ.లక్ష 40వేలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాళం పద్మశ్రీ, అడ్డాల ఆదినారాయణమూర్తి, రాజేశ్వరి, సత్యశ్రీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here