ప్రజల మనిషి జక్కంపూడి

0
206
సేవోత్సవంగా జనయోధుడి జయంతోత్సవం – ఘనంగా నివాళి
నివాళులర్పించిన ఉప ముఖ్యమంత్రి బోస్‌
రాజకీయాల్లో  రాజా మరింత ఉన్నత స్ధాయికి ఎదగాలి
రాజమహేంద్రవరం, ఆగస్టు 6 : ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికుల సంక్షేమం లక్ష్యంగా దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అనేక ఉద్యమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని, ఆయన ఒక  ఉద్యమ స్ఫూర్తి అని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. మాజీమంత్రి, జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహనరావు 66వ జయంతి వేడుకలను ఈరోజు సేవోత్సవంగా నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్‌ వద్ద జరిగిన జయంతి వేడుకలలో ఉప ముఖ్యమంత్రి పిల్లి బోస్‌, జక్కంపూడి తనయులు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌,రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ శాననసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఎపిిఐఐసి మాజీ ఛైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, నాయకులు మార్గాని నాగేశ్వరరావు  జక్కంపూడి గణేష్‌,  తదితరులు జక్కంపూడి విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బోస్‌ మాట్లాడుతూ జక్కంపూడి జిల్లాలో ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలకు ఊపిరిపోశారన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ప్రజల సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడేవారన్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా జక్కంపూడి పనిచేశారని, లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించే వారు కాదన్నారు. జక్కంపూడి తనయుడు రాజా శాసనసభ్యులుగా గెలిపొందడం ఆనందదాయకమని, జక్కంపూడి బ్రతికి ఉండి ఉంటే చాలా సంతోషించేవారన్నారు. రాజా రాజకీయాల్లో మరింత ఉన్నత స్ధాయికి ఎదగాలన్నారు. రౌతు మాట్లాడుతూ జనయోధుడు జక్కంపూడి జిల్లా అధ్యక్షుడిగా ఉండగా తనకు నగర అధ్యక్షునిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. అలాగే ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో రెండు పర్యాయాలు శాననసభ్యునిగా పనిచేసే అవకాశం దొరికిందన్నారు. జక్కంపూడి ప్రజలపక్షాన నిలబడి పనిచేశారన్నారు. ఆయన తనయులతో ఇప్పుడు పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జక్కంపూడితోనే తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందన్నారు. ఆయన జయంతోత్సవాన్ని ఒక సేవోత్సవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జక్కంపూడి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏదైనా ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని కోరారు.  ఆకుల వీర్రాజు, మార్గాని నాగేశ్వరరావులు మాట్లాడుతూ జక్కంపూడి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మంత్రి పిల్లి బోస్‌ చేతుల మీదుగా భారీ కేక్‌ను కట్‌ చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పంతం కొండలరావు, కర్రి పాపారాయుడు, బాబిరెడ్డి, అడపా వెంకటరమణ(గెడ్డం రమణ), డాక్టర్‌ లంక సత్యనారాయణ, నరవ గోపాలకృష్ణ, రాయపాటి రామచంద్రరావు, రౌతు సూర్యవరణ్‌, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, గుత్తుల మురళీధర్‌, పెంకే సురేష్‌, ప్రసాదుల హరనాధ్‌, అజ్జరపు వాసు, వాకచర్ల కృష్ణ, సంకిస రవిశేఖర్‌, ఆరిఫ్‌, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వలవల దుర్గా ప్రసాద్‌(చిన్ని),  సుంకర శ్రీను, కాటం రజనీకాంత్‌, గుడాల ప్రసాద్‌, కట్టా  కాళే చిన్ని, బాషా, కుక్క తాతబ్బాయి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, నీలం గణపతి, గుదే రఘు నరేష్‌, నిడిగట్ల బాబ్జి, అందనాపల్లి సత్యనారాయణ, బురిడి త్రిమూర్తులు, కోడికోట, అడపా అనిల్‌కుమార్‌, కానుబోయిన సాగర్‌, సోమి శ్రీను, డివి రెడ్డి, డివి స్వామి, ఉప్పాడ కోటరెడ్డి,  డాక్టర్‌ రాజశేఖర్‌,  కొరియర్‌ ప్రసాద్‌, వైసిపి నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, హసీనా, సంకిస భవానీ ప్రియ, సూరవరపు శ్రీనివాస్‌, బొరుసు శ్రీనివాస్‌, నేతల రామచంద్రరావు, జామిశెట్టి గాంధీ, కర్రి సతీష్‌, అనిశెట్టి మీరాదేవి, సాలా సావిత్రి, కొమ్ముల సాయి పెద్దఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here