ప్రజాస్వామ్యమా? నిరంకుశ పాలనా ?

0
171
వైకాపా సర్కార్‌ తీరుపై తెదేపా శ్రేణుల నిరసన
అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన-అరెస్టులు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 11 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాడులను అరికట్టాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. వైకాపా బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఆయనను గృహ నిర్భందం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. వైకాపా బాధితులకు అండగా చంద్రబాబు తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యిన్నమూరి రాంబాబు, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని,ఒక పవిత్ర లక్ష్యంకోసం చంద్రబాబు పోరాటం చేస్తుంటే గృహ నిర్భంధం చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, తమ నాయకుని పోరాటంలో సైనికులుగా ఉంటామన్నారు. తెదేపా శ్రేణులు ధర్నాకు దిగుతుండగానే పోలీసులు రంగప్రవేశం చేసి ముందస్తుగా అరెస్టు చేసి త్రీటౌన్‌ కు తరలించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొమ్మ శ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, పార్టీ నాయకులు బుడ్డిగ రాధా, అరిగెల బాబు నాగేంద్రప్రసాద్‌, గొర్రెల రమణ,మళ్ళ వెంకట్రాజు, మొల్లి చిన్నియాదవ్‌, వానపల్లి సాయిబాబా, కె. శ్రీనివాస్‌, నల్లం ఆనంద్‌, శీలం గోవింద్‌,పల్లి సాయి, జక్కంపూడి అర్జున్‌, రొక్కం రామచంద్రరా,ఎంఎ రషీద్‌, సెనివాడ అర్జున్‌,దమర్‌ సింగ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here