ప్రజాస్వామ్య విలువలను హరించడమే :ఆకుల

0
206
రాజమహేంద్రవరం, జనవరి 25 : శాసనసభ, శాసనమండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుకు నిరసనంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధవళేశ్వరం జూనియర్‌ కళాశాల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ వైకాపా కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ శాసన సభ, శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను హరించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార, పరిపాలన వికేంద్రీకరణ చేసి 13 జిల్లాల అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తీరును ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్ధి విభాగం యువనాయకుడు ఆకుల విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ధవళేశ్వరం జూనియర్‌ కాలేజీ  వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌ చంద్ర, ధవళేశ్వరం స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఎన్‌ వి,శేఖర్‌, వంటెద్దు కృష్ణ, సాధనాల శివ, యనుమల త్యాగరాజు, బిసి నాయకులు నరాల మోహన్‌ మరియు అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here