ప్రజా చైతన్యంతోనే పరిసరాల పరిశుభ్రత కల సాధ్యం

0
356
శంకర్‌ఘాట్‌లో  బిజెపి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 20 : మహాత్మగాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్‌ను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ  చేపట్టిన మిషన్‌లో భాగంగా  ఈ నెల 15వ తేది నుండి అక్టోబర్‌ 2వ తేది వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ తెలిపారు. స్వఛ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శంకర్‌ ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణతో కలిసి ఆయన పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శంకర్‌ ఘాట్‌లో  వివిధ కళాశాల విద్యార్ధిని, విధ్యార్దులతో గోదావరి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌  చెత్తను తోలగించే కార్యక్రమం చేపట్టారు. అనంతరం సత్యకుమార్‌ మాట్లాడుతూ ఏ దేశానికైనా నదులు నాగరికతకు చిహ్నామని, మనదేశంలో నదులను తల్లిగా పూజిస్తామని అటువంటి నదులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు.  మన ఇంటిని, మన దేవాలయాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వఛ్చ భారత్‌ పధకం ద్వారా ప్రజలల్లో  పరిసరాల శుభ్రత మీద చాలా వరకు చైతన్యం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ మాట్లాడుతు నగరంలోని పరిసరాల శుభ్రతకు ప్రతి ఒక్కరు పాటుపడ్డాలని,ప్లాస్టీక్‌ వంటి పదార్దాలు నదిలో కలవకుండా ప్రతి ఒక్కరు తమ భాధ్యతగా చేపట్టాలని అయన అన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలన మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం  నిరంతరం శ్రమించి మన ఆరోగ్యాన్ని కాపాడే నగర పాలక సంస్ధకు చెందిన పలువురు పారిశుద్ద్య కార్మికులను శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, జోనల్‌ ఇంచార్జీ క్షత్రియ బాల సుబ్రహ్మాణ్యసింగ్‌,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాళం పద్మశ్రీ,ఎన్‌.ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌,రామకృష్ణ రెడ్డి, మాట్టాడి చిన్ని, వీరన్నచౌదరి, ఎ.పి.ఆర్‌.చౌదరి, బిజెపి కార్యకర్తలు హిరాచంద్‌ జైన్‌, వెంకటరమణ, రౌతు వాసు, వై.మోహన్‌, కె.తమ్మజి, అనిల్‌, పండు కామవరపు వీర్రాజు, మహేష్‌, రాజేష్‌, రుత్తుల చిన్ని, రొక్కం రాజేష్‌, రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, లావణ్య,సుబ్బలక్ష్మి, భవాని వీరితో పాటు ఎ.బి.వి.పి కార్యకర్తలు,ఆదిత్య కాలేజి,ఉమెన్స్‌ కాలేజి, రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here