ప్రజా పక్షానే ఉంటా.. సమస్యలు పరిష్కారిస్తా  

0
98
తెదేపా శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం, జులై 6 :  ప్రజల మధ్య ఉంటూ వారి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. స్థానిక విఎల్‌ పురం కమ్యూనిటీ హాలులో ఈరోజు  9, 10, 11, 12 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తనను గెలిపించిన నగర ప్రజలందరికీ క తజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటుందని అన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా… ఏనాడూ ప్రతిపక్షంపై కక్ష సాధించలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై ఎటువంటి దాడులు జరిగిన పార్టీ కేడరంతా వారి వెన్నెంటే ఉండి ఆదుకుంటుందన్నారు. జగన్‌ అధికారంలో వచ్చిన తరువాత సంక్షేమం పక్కదారి పట్టిందన్నారు. పెన్షన్ల తేదీని మార్చేసారని విమర్శించారు. ఒంటరి మహిళలను విస్మరించారని, మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణు గోపాలరాయుడు మాట్లాడుతూ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, జగన్‌కు  ముందు చూపులేదన్నారు. రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని ఆయా డివిజన్లకు చెందిన నాయకులు, మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, మాజీ కార్పొరేటర్లు గగ్గర సూర్యనారాయణ, గొర్రెల సురేష్‌, కోసూరి చండీ ప్రియ, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షులు సూరంపూడి శ్రీహరి, పంచకట్ల శివ, చొప్పెళ్ల భద్రరావు, కంటిపూడి రాజేంద్ర, మరుకుర్తి రవియాదవ్‌, మేరపురెడ్డి రామక ష్ణ, చౌదరి, ఎలక్ట్రికల్‌ సత్యనారాయణ, వివిధ డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here