ప్రజా ప్రయోజనాలే తెదేపా లక్ష్యం

0
296

మోడీ సర్కార్‌పై పోరాడుతున్న చంద్రబాబుకు అండగా నిలవండి

నగరానికి చేరుకున్న ఎం.పి. మురళీమోహన్‌కు తెదేపా శ్రేణుల ఘన స్వాగతం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 12 : ప్రజా ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేస్తుందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రానికి రావలసిన హక్కుల సాధనకు సీఎం చంద్రబాబు యుద్ధం చేస్తున్నారని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు ముగించుకుని మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఎం.పి. మాగంటి మురళీమోహన్‌కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, తదితరులు మురళీమోహన్‌కు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి అభినందించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ మార్కెట్‌ సెంటర్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌, చర్చిపేట, సాయికృష్ణా ధియేటర్‌ రోడ్‌, శ్యామలా సెంటర్‌ మీదుగా కోటిపల్లి బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వరకు సాగింది. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎం.పి. మురళీమోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here