ప్రజా సంక్షేమమే తెదేపా ఎజెండా

0
132
6 డివిజన్‌లో ఇళ్ళ పట్టాల పంపిణీ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 10 : ప్రజా సంక్షేమమే తెలుగుదేశం ఎజెండా అని ఆ పార్టీ నాయకులు అన్నారు.6వ డివిజన్‌లో  కార్పొరేటర్‌ మజ్జి మౌనిక, డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో  అర్హులైన లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎం.ఎల్‌.సి.ఆదిరెడ్డి అప్పారావు, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు,ఆర్యాపురం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో టిడిపి యువ నాయకలు ఆదిరెడ్డి వాసు, కురగంటి సతీష్‌, సింహా నాగమణి, కర్రి రాంబాబు, మజ్జి సోమేశ్వర్రావు, పోలాకి పరమేష్‌, నందిగాని మురళీకృష్ణా,నల్లం ఆనంద్‌, నాయుడు సూర్య, పోసుపో శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here