ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి

0
320
మార్తి లక్ష్మీకి నియామకపత్రం అందించిన రౌతు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు పిలుపునిచ్చారు. నగర వైకాపా కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన మార్తి లక్ష్మికి ఈరోజు పార్టీ కార్యాలయంలో నియామకపత్రాన్ని అందించారు.  కో-ఆర్డినేటర్‌  రౌతు సూర్యప్రకాశరావు  ఆధ్వర్యంలో అభినందన సభ  నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా కృషిచేస్తామని, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటామని లక్ష్మిచే  ప్రతిజ్ఞ చేయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు మార్తి లక్ష్మికి బొకేలతో శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి స్వప్రయోజనాలను చూసుకుంటున్న అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు  సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని, ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, పార్టీ నాయకులు వాకచర్ల కృష్ణ, దంగేటి వీరబాబు, పతివాడ రమేష్‌, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు రబ్బాని, ఆరీఫ్‌, బ్యాంక్‌ డైరెక్టర్‌ ముప్పన శ్రీను, భీమవరపు వెంకటేశ్వరరావు, పెదిరెడ్ల శ్రీను, గుదే రఘునరేష్‌, నీలం గణపతి, రాష్ట్ర ఎస్సీసెల్‌ నాయకులు చిర్రా రాజు, కానుబోయిన సాగర్‌, కట్టమూరి విజయ్‌కుమార్‌, సప్పా ఆదినారాయణ, సాలా సావిత్రి, కాటం రజనీకాంత్‌, కట్టా అశోక్‌, ఆముదాల పెదబాబు, కంది రాఘవ, రాయుడు, కోటి, షేక్‌ మస్తాన్‌, కుక్కా తాతాబ్బాయి, కుమార్‌ యాదవ్‌, ఖాన్‌ , రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.